మునుగోడు బరిలో షర్మిల పార్టీ.. డిపాజిట్ అయినా వస్తుందా?

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీ ద్వారా సత్తా చాటాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. తెలంగాణలో షర్మిల పార్టీ ఒకటుందనే విషయాన్ని సైతం ప్రముఖ రాజకీయ నేతలు పట్టించుకోవడం లేదు. షర్మిల అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా అధికార పార్టీ నుంచి ఆమె విమర్శలకు జవాబిచ్చే వాళ్లు కరువయ్యారనే చెప్పాలి.

అయితే మునుగోడు ఉపఎన్నికలో పార్టీ తరపున అభ్యర్థిని నిలపాలని షర్మిలకు ఆమె సన్నిహితులు సూచనలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. షర్మిల పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు సైతం ఆసక్తి చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే షర్మిల పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్ అయినా దక్కుతుందా అనే కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం. షర్మిల పార్టీ పెట్టి చాలా కాలమైనా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిలయ్యారు.

షర్మిల పార్టీలో ప్రజల్లో మంచి పేరు ఉన్న నేతలెవరూ లేరు. వైఎస్సార్టీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు షర్మిల నుంచి ఆర్థికంగా సహాయసహకారాలు అందుతాయో లేదో తెలియాల్సి ఉంది. షర్మిల అభ్యర్థులకు ఆర్థికంగా సహకారం అందించని పక్షంలో వైఎస్సార్టీపీ మరో జనసేన అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిల పొలిటికల్ గా ఎదగటానికి విశ్లేషకుల సహాయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

పార్టీ బలోపేతం దిశగా షర్మిల అడుగులు వేస్తే మాత్రమే ఆమెకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిల రాజకీయంగా ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. షర్మిల తీసుకునే ప్రతి నిర్ణయం ఆమె పార్టీపై ప్రభావం చూపుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పొలిటికల్ గా షర్మిల సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.