బంగారు తెలంగాణలో ధర్నా చౌక్ ఏందిరా బై

(గుర్రం సీతారాములు)

 

ఈ రోజు ‘ధర్నాచౌక్’ మీద సీమాంధ్ర ప్రేరేపిత ఉమ్మడి హై కోర్ట్ అభ్యంతర కరమైన తీర్పు ఇచ్చింది. నగరం పట్టు వస్త్రాల తో ముస్తాబయితే నడిబొడ్డున ముష్కరులు ధర్నా చేస్తూ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేస్తారా? మా అపోలో, యశోద దవాఖాన ప్రశాంతత కు ధర్నా చౌక్ భంగం కలిగిస్తుంది. నారాయణ,చైతన్య బడి బస్సులకు, కేశినేని,దివాకర్ ట్రావెల్స్ పార్కింగ్ కోసం కదా ఆ స్థలం.
అయినా బంగారు తెలంగాణ లో అసలు నిరసనలు ఏంటి నాన్సెన్స్ ? 

చక్కగా త్యాగరాయ గాన సభ,రవీంద్ర భారతి, లో పగటి పూట, రాత్రి జీయర్ ప్రవచనాలు వింటూతగలడే దానికి ఏంటసలు అలాగా జనాలు అలాగా బుద్దులు.


ధర్నా చౌక్ అట? నిరుద్యోగులకు నిరసన చౌక్ అట. అసలు ఉసిళ్లు బయలు దేరినట్టు ఉద్యోగాలు వస్తుంటే ధర్నా చౌక్ వైపు కన్నెత్తి చూసేవాడు ఎవరూ? ఆ సరూర్ నగర్ జింకల పార్క్ లోనో మరొక అభయారణ్యం లోకో పోయి జూ లో ఉన్న జంతువుల పళ్ళు తోముతూ నిరసన తెలపండి.


చూశారా ఈ తీర్పు సీమాంధ్ర కోర్టుల కుట్ర. అదే మన తెలంగాణ కు ప్రత్యేక కోర్ట్ ఉంటే ఆ సమస్య ఉత్పన్నం అయ్యేదా ? అందుకే ధర్నా చౌక్ అవసరం లేదని కాళేశ్వరం కవుల మద్దతుతో మన కోర్ట్ మనకే కావాలి అని తొందరగా దీక్ష చేయాలి .దానికి ముహూర్త బలం సరిగా ఉందొ లేదో చూడాలి. 


ఎదవ గోల ఎదవ గోల. 
తక్షణమే ఉమ్మడి హై కోర్ట్ ను అమరావతికి తరమాలి. మన పాలనలో మన కోర్ట్ లు మన తీర్పులు మాత్రమే ఉండాల తెలిసిందా ?!!!

(గుర్రం సీతారాములు,ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు)
(ఇది ఫేస్ బుక్  నుంచి)