ఆ నలుగురు ఎమ్మెల్సీలకు స్వామిగౌడ్ నోటీసులు

టిఆర్ఎస్ నుంచి గోడ దూకిన నలుగురు ఎమ్మెల్సీలకు ఊహించని షాక్ తగిలింది. వారికి తెలంగాణ శాసనసమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వారు ఇచ్చిన వివరణ ఆధారంగా వారిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు శాసనమండలి వర్గాలు చెబుతున్నాయి.

నోటీసులు అందుకున్నవారు ఎవరంటే ?

1 యాదవ రెడ్డి (రంగారెడ్డి జిల్లా)

2 భూపతిరెడ్డి (నిజామాబాద్ జిల్లా)

3 కొండా మురళి (వరంగల్ జిల్లా)

4 రాములు నాయక్ (మెదక్ జిల్లా)

వీరు నలుగురు ఎన్నికల ముందు టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇందులో కొందరిని టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కానీ రాములు నాయక్, యాదవ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారు నలుగురిపైనా వేటు వేయాలని కోరుతూ సోమవారం శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేశారు. 

తెలుగు సంవత్సరాల పేర్లు తెలుసా…. చదవండి

ఈ విషయాన్ని వెంటనే పరిశీలించిన శాసనమండలి ఛైర్మన్ 24 గంటల్లోనే ఆ నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. 

ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ ఫిరాయింపులు, ఫిరాయింపు దారులపై చర్యలు అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.  ఆ నలుగురి మీద ఏరకమైన చర్యలు ఉంటాయా అని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.

రాములు నాయక్, ఎమ్మెల్సీ
కొండా మురళి, ఎమ్మెల్సీ
యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ