టిఆర్ ఎస్ మాగంటి గోపీనాధ్ మీద బండ్ల గణష్ పోటీ?

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారంఅనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని పవన్ కల్యాణ్ జనసైనికులు వూహించి వుండరు. ఢిల్లీలో  శుక్రవారం నాడు బం డ్ల గణేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి  ఆహ్వానించారు.

అనంతరం బండ్ల గణేశ్‌ విలేకరులతో మాట్లాతూ తాను తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నట్లుసూచన ప్రాయంగా చెప్పారు. ఒక సినిమా ప్రముఖుడు,  ఇలా కాంగ్రెస్ లో అందునా ఈ సమయంలో చేరడం పార్టీ లో బాగా ఉత్సాహాన్నించింది. అంతేకాదు, కాంగ్రెస్ పుంజుకుంటూ ఉందని కూడా కార్యకర్తల్లో ఆత్మ స్థయిర్యం పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. ఎందుకంటే, కాంగ్రెస్ పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉంటే బండ్ల గణేశ్ లాంటి ముందుచూపున్న సినీ ప్రముఖుడు మునిగే నావలో ప్రయాణిస్తాడా?   బండ్ల గణష్ చర్య కాంగ్రెస్ లో చేరాలనుకుని వూగిసలాడుతున్న చాలా మందికి విశ్వాసం పెంపొందిస్తుంది.

‘కాంగ్రెస్‌ పార్టీ ఏది చెప్తే అది చేస్తాను.  ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను,’అని గణేష్ తెలిపారు. 

 

‘శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలనేదే నా చిరకాల కోరిక,’ అని అన్నారు.  ‘ ప్రజాసేవ చేయాలనిపించి రాజకీయాల్లో వచ్చినట్లు ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఆయనను జూబ్లీ హిల్స్ నుంచి నిలబెట్టే  అవకాశం ఉంది. అక్కడ టిఆర్ ఎస్ మరొక సినిమా ప్రముఖుడు మాగంటి గోపీనాథ్ ని నిలబెట్టింది. ఆయన మీద  బండ్ల గణేష్ నిలబడే అవకాశం ఉంది. 

ఈ విషయం ప్రస్తావిస్తే…  నేను బేషరతుగా పార్టీలో చేరాను.  రాహుల్‌ గాంధీతో  ఈ విషయం ప్రస్తావించలేదు అని బదులిచ్చారు.

అయితే పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని మాత్రం స్పష్టం చేశారు.   సినిమా రంగం తనకు ప్రాణమని అంటూ రాజకీయాలు వేరు, సినిమా రంగం వేరని అన్నారు. 

ఒక సినిమా ప్రముఖుడికి రాజకీయాల మీద ఇంత క్లారిటీ ఉండటం ఆశ్చర్యం.