టిఆర్ఎస్ సర్కారు పతనం కాక తప్పదు : కాంగ్రెస్ రవళి (వీడియో)

తెలంగాణలో టిఆర్ఎస్ సర్కారుకు నూకలు చెల్లిపోయాయని విమర్శించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి కూచన. తెలంగాణ సర్కారు పతనం దిశగా పయనిస్తోందనడానికి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి బోనాల జాతరలో స్వర్ణలత చెప్పిన భవిష్యవాణి చూస్తేనే తేలిపోయిందన్నారు. అంతేకాదు జోగిని శ్యామల కూడా శాపనార్థాలు పెట్టి సర్కారు పడిపోతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. రవళి సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. మరిన్ని అంశాల కోసం ఆమె మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

[videopress 4crGny4v]