తెలంగాణలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్నదని దానికి అనుగుణంగా అధికారులు, వర్క్ ఏజెన్సీలు
నిర్లక్ష్యం వహించకుండా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించారు. మూడు షిఫ్టుల్లో నాలుగు రెట్లు లేబర్ ని , మెషినరీ ని పెంచి వేగంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా రెండవ రోజు బుధవారం కన్నేపల్లి పంప్ హౌజ్ నుండి అన్నారం బ్యారేజి వరకు నీటిని తరలించే కాలువ పనులను పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి సుమారు 15 కిలోమీటర్లు అన్నారం బ్యారేజీ వరకు రోడ్డు కాలువ వెంబడి ప్రయాణిస్తూ అనేక చోట్ల ఆగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ పని ఏ స్టేజీలో ఉంది ? ఎంత మేరకు పూర్తయ్యింది ? ఇంకా ఎంత పని కావాల్సి ఉంది ? అని అధికారులను , వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు .ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? అని ఆరా తీశారు.
కొన్ని చోట్ల కాలువ సైడ్ స్లోప్స్ కూలిపోతున్నాయని , అటువంటి రీచేస్ లో కాంక్రీట్ గైడ్ వాల్స్ కడితే క్షేమంగా ఉంటుందని అధికారులు సూచించారు. ముఖ్యమంత్రి వాటిని చూసి వెంటనే గైడ్ వాల్స్ నిర్మించడానికి ఏర్పాటు చేసుకోవాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ ని ఆదేశించారు. వర్క్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే విషయంలో జాప్యం జరగొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సెక్రెటరీ స్మితా సభర్వాల్ ను ఆదేశించారు. అన్నారం బ్యారేజీ నుండి పుంప్ హౌజ్ వరకు ఉన్న కాలువ లైనింగ్ పనులు ఇంకా నాలుగు రెట్లు పని పెరగాలని,లేబర్ ను కూడా అవసరానికి అనుగుణంగా పెంచుకోవాలని సీఎం సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అన్నారు . మార్చ్ నెలాఖరుకు కాలువ పనులు పూర్తి అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలని సి ఎం ఆదేశించారు.
అనంతరం అన్నారం బ్యారేజి వద్ద పనులని పరిశీలించి పనులపై afscon కంపెనీ ప్రతినిధులతో, ఇంజనీర్లతో సమీక్షించారు. అన్నారం బ్యారేజీ పనులు మొత్తం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేస్తామని కంపనీ ప్రతినిధులు సి ఎం కు హామీ ఇచ్చారు. అన్నారం బ్యారేజి పనులపై సి ఎం సంతృప్తిని వ్యక్తం చేసినారు. అనంతరం అసున్దిల్ల బ్యారేజి , అన్నారం పంప హౌజ్ , సుందిళ్ళ పంప హౌజ్ పనులని కూడా సి ఎం పరిశీలించారు. సుందిళ్ళ బ్యారేజి పనులు మందకొడిగా సాగుతున్నాయని , ఎట్టిపరిస్థితుల్లో బ్యారేజి పనులు, ఫ్లడ్ బ్యాంక్ పనులు , రివేట్ మెంట్ పనులు మార్చ్ నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించినారు. పంపు లు , మోటార్ల బిగింపు పనులు కూడా మార్చ్ నెలాఖరుకు పూర్తీ చేసి ఏప్రిల్ లో వెట్ రన్ కు సిద్దం చేయాలని ఆదేశించినారు. పంప హౌజ్ ల వద్ద ట్రాన్స్కో వారు నిర్మించిన విద్యుత్ సం స్టేషన్లను వాన నీటి నుంచి రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
అనంతరం శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లో భాగంగా రాజేశ్వర్ రావు పేట వద్ద నిర్మాణం అవుతున్న రెండవ పంప హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదట రెండు పంపు హోజుల్లో మొత్తం 18 పంపులు , మోటార్ల బిగింపు ప్రక్రియని వేగవంతం చేయాలని, మూడ పంప హజ్ పనులు ఆపివేసి అక్కడ నుంచి లబార్, మేశినరీని మొదటి పంపు హౌజ్ ల వద్దకు తరలించి మార్చ్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించినారు. ఆ తర్వాత జూన్ చ్నాటికి మూడవ పంపు హజ్ పనులు పూర్తి చేసుకోవాలని సూచిన్చినారు.
ప్రాజెక్టు పూర్తయి సాగు నీరు అందించే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం టూరిజం లో బాగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అన్నారు . కాళేశ్వరం దేవాలయం , ఫారెస్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే టూరిస్టుల సంఖ్య ఇంకా భారీగా పెరుగుతుందని 5 నుండి 10 ఎకరాల్లో హోటళ్లు నిర్మాణం జరిగేలా ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు . మల్టీ నేషనల్ కంపెనీలను టూరిజం అభివృద్ధి లో భాగస్వాములను చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సీఎం వివరించారు . ప్రాజెక్టు పనులు చేసే క్రమంలో రోడ్లు నిర్మించడం సహా ఎలక్ట్రిక్ బోటింగ్ వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు .
రామగుండం నుండి రైల్వే మార్గం కూడా పొడిగిస్తామని భవిష్యత్తులో ఈ ప్రాంతం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని సీఎం అన్నారు. ఇక నుండి ఎప్పటికప్పుడు తాను కూడా ప్రాజెక్టు పనులను సమీక్షిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు .ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు , ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, సీఈ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే, లిప్ట్ సలహాదారు పెంటారెడ్డి, మెగా ఎండీ కృష్ణారెడ్డి ఉన్నారు.