Home News కాళేశ్వ‌రం ముక్తేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో సీఎం కేసీఆర్ పూజ‌లు

కాళేశ్వ‌రం ముక్తేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో సీఎం కేసీఆర్ పూజ‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిశీలన కోసం కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర , ముక్తేశ్వర స్వామివార్ల దర్శనానికి వెళ్లారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మంత్రులకు వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆలయం లోపలకు తీసుకెళ్లారు.

Cm Kcr Visits Kaleshwaram And Barrage Also - Sakshi

అంత‌కుముందు వారికి అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగతం ప‌లికారు. కాగా, కాసేప‌ట్లో కేసీఆర్ హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ‌ద్ద‌కు వెళ్లి రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ద్వారా.. నీటిని పంపించే విధానాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పర్యటన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్రధాన బ్యారేజ్‌లు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగి సీజన్‌లో పంటలకు జలాలను పంపింగ్‌చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు.

అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్‌ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు.మ‌ధ్యాహ్నం లక్ష్మీ బరాజ్ వ‌ద్దే కేసీఆర్ భోజ‌నం చేస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా పోలీసులు కాళేశ్వ‌రం వ‌ద్ద‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Posts

మంత్రి బుగ్గన సంచలన ప్రకటన: కర్నూలులో 250 ఎకరాల్లో హైకోర్టు!

కర్నూలులోని జగన్నాథగుట్ట ప్రాంతంలో 250 ఎకరాల్లో రాష్ట్ర హైకోర్టు నిర్మితమవుతుందనీ, జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రక్రియ హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చిన తర్వాత ప్రారంభమవుతుందనీ వైసీపీ ముఖ్య నేత, ఏపీ ఆర్థిక మంత్రి...

రెండో వివాహం చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య !

ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ డాన్‌ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ...

సబ్బం సంచలనం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక ‘క్విడ్ ప్రో కో’.!

మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రైవేటీకరణ వెనుక 'క్విడ్ ప్రో కో' (నీకిది.. నాకది..) వ్యవహారం వుందని...

Latest News