తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో వెనుకడుగు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలామంది గుర్తింపు ఉన్న జాతీయ పార్టీల నేతలు కేసీఆర్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా హైదరాబాద్ కు రాగా కేసీఆర్ పార్టీకి ఆయన మద్దతు ఇవ్వకపోవడంతో టీ.ఆర్.ఎస్ నేతలు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు.
మరోవైపు కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా ఢిల్లీలో ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. అయితే బీ.ఆర్.ఎస్ విషయంలో గతంతో పోల్చి చూస్తే ఆయన ఆలోచన పూర్తిస్థాయిలో మారిందని తెలుస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ బీ.ఆర్.ఎస్ కు సంబంధించి తొందరపడ్డానేమో అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ రాజకీయాల విషయంలో వేస్తున్న అడుగులు కరెక్ట్ గా లేవని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇతర పార్టీలు పుంజుకుంటున్నాయనే విషయాన్ని ఆయన గమనిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే మాత్రం కేసీఆర్ సర్కార్ కు ఆ గెలుపు ఒక విధంగా వార్నింగ్ బెల్ అని చెప్పవచ్చు. మునుగోడు ఉపఎన్నికలో టీ.ఆర్.ఎస్ గెలవని పక్షంలో టీ.ఆర్.ఎస్ నేతలు ఓటమి గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీలకు తగిన గుర్తింపు లేకపోవడం ఆ పార్టీకి ఒక విధంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.