మహా కూటమిలో ఆ 11 సీట్లలో తప్పని టెన్షన్

మహాకూటమిలో సీట్ల లెక్క తేలింది. ఇప్పటి వరకు కూటమిలో 108 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా మరో 11 స్థానాలు పెండింగ్ లో ఉంచారు. వీటిని కూడా ఆదివారం సాయంత్రం వరకు ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 88, టిడిపి 13, టిజెఎస్ 4 సిపిఐ 3 చోట్ల అభ్యర్దులను ప్రకటించింది.

పెండింగ్ లో ఉన్న 11 స్థానాల్లో టిజెఎస్ కు 3 లేదా 4 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. 6 చోట్ల కాంగ్రెస్, మరో స్థానం తెలుగుదేశం పార్టీకి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతో కొంత మంది అసంతృప్త నేతలు రెబల్ గా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో కూటమి సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బంది తప్పేలా లేదు.

పెండింగ్ లో 11 స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 6 చోట్ల పోటి చేసే అవకాశం ఉంది. అవి ఎవరికి దక్కే అవకాశం ఉందంటే

నారాయణ ఖేడ్- సురేష్ షెట్కార్

హూజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి

దేవరకద్ర- పవన్ కుమార్ రెడ్డి

నారాయణ పేట- శివకుమార్ రెడ్డి లేదా షరాబ్ శివకుమార్

సికింద్రాబాద్- కాసాని జ్ఞానేశ్వర్ లేదా ఆదం ఉమా, బండ కార్తీక వీరిలో ఒకరికి ఛాన్స్

కోరుట్ల- జువ్వాడి నర్సింగరావు లేదా కొమ్మిరెడ్డి జ్యోతి

రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ పోటి చేస్తే బండ్ల గణేష్ కు అవకాశం

జన సమితి పోటి చేయాలనుకుంటున్న స్థానాల్లో ఉన్న అభ్యర్ధులు

వర్ధన్న పేట- డాక్టర్ దేవయ్య

అంబర్ పేట- సత్యం గౌడ్

మిర్యాలగూడ- విజయేందర్ రెడ్డి

వరంగల్ తూర్పు – గాదె ఇన్నయ్య

వరంగల్ తూర్పు కాంగ్రెస్ కు కేటాయిస్తే అక్కడి నుంచి వద్దిరాజు రవిచంద్ర పోటి చేయనున్నారు. మిర్యాలగూడ కూడా కాంగ్రెస్ కు కేటాయిస్తే అక్కడి నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటి చేయనున్నారు. అయితే మిర్యాలగూడ సీటు విషయంలో టిజెఎస్ పట్టుదలతో ఉంది. 8 స్థానాలు ఇస్తామన్న దానికి కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ నేతలకు తెలిపినట్టు తెలుస్తోంది. జనగామ సీటును వదులుకున్నామని ఇక ఏ సీటును కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉండవద్దని జనసమితి నేతలు కోదంరాంకు సూచించారు.

తెలంగాణ జనమితి 4 సీట్లకు అభ్యర్దులను ప్రకటించింది. మరో 4 సీట్లకు ఆదివారం అభ్యర్ధులను ప్రకటించనుంది.

జన సమితి ప్రకటించిన 4 స్థానాల్లోని అభ్యర్ధులు

మల్కాజ్ గిరి – దిలీప్ కుమార్

దుబ్బాక- రాజ్ కుమార్

సిద్దిపేట- భవానీ రెడ్డి

మెదక్- జనార్ధన్ రెడ్డి

అన్ని పార్టీల నాయకులు అర్ధం చేసుకోవాలని కూటమిలో  సీట్ల లొల్లి వద్దని అన్ని పార్టీల నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. స్నేహ పూర్వక పోటి కూడా లేనట్టే కనబడుతోంది. నాయకులు కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని టిఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పని చేయాలని వారు పిలుపునిచ్చారు. నామినేషన్ల ప్రక్రియ సోమవారానికే చివరి రోజు కావడంతో ఆదివారం మధ్యాహ్నం కల్లా పెండింగ్ సీట్ల జాబితా ఖరారవుతుందని తెలుస్తోంది.  టిడిపి రాజేంద్రనగర్ నుంచి పోటి చేస్తుందని నేతల ద్వారా తెలుస్తోంది. 

119 స్థానాల్లో 94 కాంగ్రెస్, టిడిపి 14, టిజెఎస్ 8, సిపిఐ 3 స్థానాల్లో పోటి చేయనున్నట్టు తెలుస్తోంది.