టిఆర్ఎస్‌కు అసత్య ప్రచారాలు చేయద్దు:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో జాతీయ విపత్తుల నిర్వాణ కింద 3000 కోట్లు విడుదల చేసింది అని అన్నారు. 2018 నుంచి విపత్తు సహాయ నిధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని అన్నారు.

ఇక జాతీయ విపత్తు ప్రతి స్పందన నిధి కింద తెలంగాణకు కేంద్రం ఎటువంటి సహాయం అందించలేదని.. టిఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసింది అని మండిపడ్డారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించడం లేదని తెరాస నాయకులు తప్పుడు వాదనలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. అంతేకాకుండా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అందిన వాటాలను పూర్తిగా వివరించారు.