ఎమ్మెల్సీ కవితకు సీబీఐ పిలుపొచ్చింది.! తర్వాతేంటి.?

వచ్చేసింది.. సీబీఐ నుంచి పిలుపు అందుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీలో విచారణకు హాజరవుతారా.? హైద్రాబాద్‌కి రమ్మంటారా.? ప్లేస్ ఎక్కడో మీరే డిసైడ్ చేయండి.. అన్నట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి విచారణ నిమిత్తం సీబీఐ, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది.

‘అబ్బే, విచారణ కోసం కాదు.. సాక్ష్యం ఇచ్చేందుకే..’ అంటూ ఓ వర్గం మీడియాలో కథనాలొస్తున్నాయి. కానీ, ‘ఎగ్జామిన్.. ఇన్వెస్టిగేషన్’ అంటూ టెక్నికల్లీ సౌండెడ్ పదాల్నే నోటీసుల్లో పేర్కొంది సీబీఐ. సో, సీబీఐ ఎలాంటి విచారణ చేస్తుంది.? ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.

సీబీఐ వస్తదో, ఈడీ వస్తదో.. రానియ్యండి చూద్దాం.! అరెస్టులకూ, జైలుకి వెళ్ళేందుకూ భయపడే ప్రసక్తే లేదు.. అంటూ ఈ మధ్యనే కల్వకుంట్ల కవిత, మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణ సందర్భంగా ఓ నిందితుడి రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావనకు రావడంపై కవిత అలా స్పందించారు. అసలంటూ ఈ కేసుతో లింకులు లేకపోతే, కవిత తన ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఫోన్ల ధ్వంసం వ్యవహారాన్ని ఈడీనే వెల్లడించింది.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌తో కవిత నేడు ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. తండ్రి వద్ద కేసు వ్యవహారాలపై కవిత మొరపెట్టుకున్నారా.? కూతుర్ని ఓదార్చేందుకు కేసీయార్ ఆమెను ప్రగతి భవన్‌కి పిలిపించుకున్నారా.? అంటూ రాజకీయ వర్గాల్లో సెటైర్లు పడుతున్నాయి. ఇంతకీ, విచారణ తర్వాత ఏం జరగబోతోంది.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. అరెస్టు, జైలు.. అంటూ కవిత కాస్త తొందరపడ్డారు. మరి, ఆమె కోరికను సీబీఐ తీర్చేస్తుందా.?