తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీలో పోటీ చేయడం ద్వారా కొన్ని సీట్లలో అయినా పార్టీ విజయం సాధిస్తుందని కేసీఆర్ నమ్ముతున్నారు. అయితే కేసీఆర్ ఇక్కడ మరిచిపోతున్న కొన్ని విషయాలు ఉన్నాయి. విభజన పాపం వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితి ఉంటే ఏపీలో బీ.ఆర్.ఎస్ కు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
మోసం చేసిన వాళ్లను ఏపీ ప్రజలు అస్సలు క్షమించారు. కేసీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏపీ ప్రజలు ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకు ఒక విధంగా కేసీఆర్ కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏపీలో బీ.ఆర్.ఎస్ పార్టీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఉంది. 2023 జనవరిలో ఏపీలో బహిరంగ సభ జరగనుందని సమాచారం అందుతోంది. అయితే కేసీఆర్ పార్టీ విషయంలో జగన్ అసంతృప్తితో ఉన్నారు.
రాష్ట్రంలో పోటీ చేసే పార్టీల సంఖ్య అంతకంతకూ పెరగడం వల్ల ఓట్లు చీలే అవకాశం అయితే ఉందని జగన్ భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీల సంఖ్య పెరగడం వల్ల టీడీపీకి సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో బీ.ఆర్.ఎస్ పోటీ చేస్తే తెలంగాణపై వైసీపీ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. జగన్, కేసీఆర్ మధ్య దూరం పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో కేసీఆర్ బహిరంగ సభ పెడితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. కేసీఆర్ తన పార్టీని ఏపీకి దూరంగా ఉంచితే మంచిది. జగన్, కేసీఆర్ ఈ విధంగా చేస్తే రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.