MLC Seat Race: MLC రచ్చ: బీఆర్ఎస్‌కు ఒకే ఒక్క అవకాశం.. ఎవరికి దక్కబోతోంది?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా, బీఆర్ఎస్‌కి ఒక్క స్థానం మాత్రమే దక్కనుంది. గులాబీ పార్టీ బలం గణనీయంగా తగ్గడంతో, ఒక్క ఎమ్మెల్సీ స్థానానికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ఆ ఒక్క అవకాశం ఎవరికి దక్కబోతోందన్నది. కేసీఆర్ ఈసారి కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా? లేక ఇప్పటికే ఉన్న వారిలో ఒకరికి మళ్లీ అవకాశం కల్పిస్తారా? అనే అంశంపై పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే, బీఆర్ఎస్‌కి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక వ్యూహాత్మక సవాల్‌గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీగా సీట్లు కోల్పోవడంతో, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారా? లేదా? అనే అంశాన్ని సుప్రీంకోర్టులో తమ వాదనకు ఉపయోగించాలని భావిస్తోంది. దీంతో ఎన్నికల కంటే ఈ వ్యూహం మీదే పార్టీ ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలన్న డిమాండ్ బీఆర్ఎస్‌లో పెరుగుతోంది. పార్టీ బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఈ స్థానాన్ని బీసీ నేతకు కేటాయించడం రాజకీయంగా మద్దతు పెంచే అవకాశముంది. కానీ, సత్యవతి రాథోడ్ పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. ఆమెకు మళ్లీ అవకాశం ఇచ్చే అవకాశముందా? లేక కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏదైనా, ఇది పార్టీలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. కేసీఆర్ తన పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహం అవలంబిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై ప్రభావం చూపనుంది.

బాబు, జగన్ పిచ్చి || Congress Leader Tulasi Reddy Shocking Commnets On Cahandrababu & Ys Jagan || TR