హైదరాబాద్ :బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా, పార్టీలో జోస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు పూర్తిగా స్వేచ్ఛను పార్టీ అధిష్టానం కల్పించింది. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ బాగా బలం పుంజుకుందని, టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తోంద ని, ఇదే స్పీడ్ కొనసాగిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిజెపిదే విజయం అనే విషయాన్ని అధిష్టానం పెద్దలు గుర్తించారు. అందుకే ఆయన నిర్ణయాలు అన్నిటికీ మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఇక త్వరలోనే బండి సంజయ్ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ బస్సు యాత్ర బాధ్యతలన్నీ ఈమధ్యనే బిజెపిలో చేరిన విజయశాంతికి అప్పగించాలనే ఆలోచనలు కేంద్ర పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లా కేంద్రాల్లోనూ బిజెపి బస్సు యాత్ర కొనసాగే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ యాత్ర ద్వారా ప్రజలలో బిజెపి పై వ్యతిరేకత ఏర్పడే విధంగా చేయడంతో పాటు, టిఆర్ఎస్ తప్పిదాలు అన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని, ఆ పార్టీని చేయాలని లక్ష్యంగా చేసుకునే ఈ యాత్ర సాగిబోతోంది. ఈ యాత్ర లో విజయశాంతి కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పై విమర్శలు చేయడంలో విజయశాంతి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆమెను కెసిఆర్ పై బాణం లా వదిలేందుకు బిజెపి పెద్దలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర ద్వారా బీజేపీ లో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం కనిపిస్తోంది.