ఎగ్జిట్ పోల్స్ పరువు గోవింద.. మునుగోడు విషయంలో ఆ పార్టీ స్ట్రాటజీ కరెక్ట్?

మరికొన్ని గంటల్లో మునుగోడు ఫలితం తేలిపోనుంది. ఉపఎన్నిక ఫలితాలలో తెరాస, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండగా ఏ పార్టీ గెలుస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రౌండ్ రౌండ్ కు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం అంతకంతకూ పెరుగుతుండటంతో బీజేపీ ఈ ఉపఎన్నికలో గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ విజయం సాధించినా మెజారిటీ స్వల్పంగానే ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పలు ప్రముఖ సంస్థలు మునుగోడు ఉపఎన్నిక పూర్తైన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించగా ఆ ఫలితాలలో తెరాసకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు భిన్నంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీ నేతలు సైతం ఒకింత సైలెంట్ అయ్యారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం మారుతుండటంతో ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేము.

అయితే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మాత్రం ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చాలా సంస్థలు ఫలితాలను సరిగ్గా అంచనా వేయడంలో తడబడ్డాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా 2024 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేయడం ఎన్నికల ఫలితాలపై ఒకింత ప్రభావం చూపిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఖర్చు విషయంలో రెండు పార్టీల అభ్యర్థులు రాజీ పడలేదు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరగగా తెరాస ఆధిక్యం అంతకంతకూ తగ్గుతోంది. చివరి రౌండ్ సమయానికి ఏ పార్టీ పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. మునుగోడు ఉపఎన్నికలో తెరాస కంటే బీజేపీ స్ట్రాటజీలే కరెక్ట్ గా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.