కూకట్ పల్లిలో భూమా అఖిలప్రియ అరెస్ట్ .. పరారీ లో భర్త ! !

హఫీజ్ పేటలో వెలుగులోకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియను కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు.

నార్త్ జోన్ మహిళా ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆయన్ను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. బోయిన్ పల్లి మహిళా పోలీసు స్టేషన్ లో ఆమెను విచారించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. అఖిల ప్రియ అరెస్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.