మెడలో టిఆర్ఎస్ కండువా, ప్రచారం కాంగ్రెస్ కు (వీడియో)

వారంతా యూత్. టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు. వారిది నారాయణపేట నియోజకవర్గం. వారు చేసిన విచిత్రమైన కార్యక్రమం తెలంగాణలోనే హాట్ టాపిక్ గా నిలిచింది. వారు టిఆర్ఎస్ కార్యకర్తలు కాబట్టి లెక్క ప్రకారం మెడలో గులాబీ కండువాలు వేసుకున్నారు. బైక్ ర్యాలీ తీశారు. కానీ స్లోగన్స్ మాత్రం జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్ అని చేశారు. ఇదేంటి? మెడలో గులాబీ కండువాలు వేసుకుని కాంగ్రెస్ కు ప్రచారం చేయడమేంది అనుకుంటున్నారా? ఫుల్ డిటైల్స్ చదవండి. వీడియో చూడండి ఎట్లుందో?

ఒకప్పటి టిఆర్ఎస్ నేత శివకుమార్ రెడ్డి

మహా కూటమి పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు సోమవారం వరకు కొనసాగింది. ఆదివారం రాత్రి 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ తన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో అనూహ్యమైన నిర్ణయాలు జరిగాయి. సీటు వస్తది అని ధీమాగా ఉన్నవారికి మొండిచేయి చూపిన కాంగ్రెస్ పార్టీ సీటు రాదని భాదల్లో ఉన్నవారికి అనౌన్స్ చేసి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ పరిస్థితుల్లో నాలుగో జాబితాలో నారాయణపేట్ సీటును వామనగారి కృష్ణను అనూహ్యంగా అభ్యర్థిగా ప్రకటించింది. 

నారాయణపేట సీటును కాంగ్రెస్ పార్టీ తరుపున శివకుమార్ రెడ్డి ఆశిస్తున్నారు. ఆయన గతంలో టిఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేశారు. అయితే అప్పుడు టిడిపి తరుపున పోటీ చేసిన రాజేందర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన బంగారు తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. ఆయన టిఆర్ఎస్ లో చేరడంతో అప్పటి వరకు టిఆర్ఎస్ లో ఉన్న శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మహా కూటమిలో భాగంగా ఆ సీటును కాంగ్రెస్ తీసుకుంది.

రాజేందర్ రెడ్డి ఒకప్పటి టిడిపి ఎమ్మెల్యే, ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థి

అయితే శివకుమార్ రెడ్డికి టికెట్ వస్తుందని ప్రచారం సాగింది. కానీ చివర్లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చక్రం తిప్పడంతో ఆయన అనుచరుడైన వామనగారి కృష్ణకు టికెట్ దక్కింది. ఇప్పటికే శివకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఆయన రెబెల్ గా బరిలో ఉంటారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. 

ఈ సమయంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండి వేణుగోపాల్ రెడ్డి, ఆయన సహచర టిఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం నారాయణపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో వారు మెడకు టిఆర్ఎస్ కండువాలు వేసుకుని జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేసి పట్టణంలో హల్ చల్ చేశారు. కాంగ్రెస్ నేత శివకుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని వారంతా నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ర్యాలీ వీడియో కింద ఉంది చూడండి.

కానీ సీన్ కట్ చేస్తే ఆదివారం రాత్రి విడుదలైన జాబితాలో శివకుమార్ రెడ్డి పేరు గల్లంతైంది. ఆయనకు వస్తదనుకున్నా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కృష్ణకు ఆ సీటు దక్కింది. మరి ఈ పరిస్థితుల్లో శివకుమార్ రెడ్డికి మద్దతు తెలిపిన టిఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో శివకుమార్ రెడ్డి పోటీలో ఉంటారా? ఉంటే ఆయనకు మద్దతుగా ర్యాలీ చేపట్టిన టిఆర్ఎస్ కేడర్ అంతా ఆయనకు బహిరంగంగా సపోర్ట్ చేస్తారా? లేదంటే అందరూ కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణకు సపోర్ట్ చేస్తారా? లేదంటే ఇదంతా ఎందుకని టిఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డికే మద్దతుగా నిలబడతారా అన్నది తేలాల్సి ఉంది. టిఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ కు సపోర్ట్ గా ర్యాలీ తీసి ట్విస్ట్ ఇద్దామనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ వారు కోరిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా మరో ట్విస్ట్ ఇవ్వడం కొసమెరుపు.