తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ఈ మధ్య కాలంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వల్ల విమర్శల పాలు కావడంతో పాటు వార్తల్లో నిలిచింది. ప్రభుత్వం ప్రత్యక్షంగా తప్పేం చేయకపోయినా కొందరు ఉద్యోగులు చేసిన తప్పు వల్ల ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మొత్తం 1540 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. జిల్లా సెలక్షన్ కమిటీతో పాటు తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆశా వర్కర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మంత్రి హరీష్ రావు చెప్పిన విధంగా నోటిఫికేషన్ విడుదలైంది.
మహిళలు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉండటంతో పాటు వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి పాసైన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 10,000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. మహిళా నిరుద్యోగులు, గృహిణులు ఈ ఉద్యోగలా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షలు చేయడం, ఇంజక్షన్లు చేయడం, చిన్నపిల్లలకు సరైన సమయంలో టీకాలు అందించడం, అవసరం ఉన్నవారికి మెడిసిన్స్ అందించడం ద్వారా ఆశా ఉద్యోగులు తమ విధులను కరెక్ట్ గా నిర్వహించవచ్చు. తెలంగాణ సర్కార్ వరుస నోటిఫికేషన్లను విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది.