కొడంగల్ లో బౌన్సర్ల ఓవర్ యాక్షన్ ఎందుకు ? ఆనం రెడ్డి లైవ్ వీడియో

కొడంగల్ లో మొన్న మంత్రి హరీష్ రావుతోపాటు నాయిని నర్సింహ్మారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అన్న కూతురు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆనం రెడ్డి రియాక్ట అయ్యారు. ప్రశాంతంగా ఉండే కొడంగల్ లో అలజడి రేపే ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదన్నారు. అంతమంది బౌన్సర్లను తెచ్చుకుని కొడంగల్ లో ఓవర్ యాక్షన్ చేసుడు అవసరమా అని ప్రశ్నించారు.

గుర్నాథ్ రెడ్డి 35 ఏండ్లపాటు రాజకీయాలు చేసినా ఏనాడూ ఒక్క బౌన్సర్ ను కూడా కొడంగల్ కు తీసుకురాలేదన్నారు. కొడంగల్ లో లయన్ రేవంత్ రెడ్డి ఉన్నాడన్న భయంతోనే బౌన్లర్లను తెచ్చుకున్నారా అని ప్రశ్నించారు. కొడంగల్ లో ఎవరైనా పోటీ చేయవచ్చని, పోటీ చేయాలనుకుంటే ప్రజల మద్దతు కావాలి తప్ప బౌన్సర్లు కాదని చురకలు వేశారు. ఆనం రెడ్డి ఫేస్ బుక్ లో ఒక వీడియోను పోస్టు చేశారు. కొడంగల్ లో బస్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆ వీడియోలో వివరణ ఇచ్చారు. కింద వీడియో ఉంది చూడండి.