మిర్యాలగూడ అమృత ప్రణయ్ లకు కొడుకు పుట్టాడు. అమృత తమ పెళ్లి రోజైన జనవరి 30న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకును ఎత్తుకొని ఉన్న ఫోటోను అమృత సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని కిరాయి హంతకులతో మర్డర్ చేయించాడు. అప్పుడు అమృత 5 నెలల గర్భిణి. మరో ప్రణయ్ పుట్టాడంటూ అమృత సంతోషాన్ని వ్యక్తం చేసింది. క్యాస్టిజం పై తన కొడుకు పోరాడుతాడడని అమృత తెలిపింది.