Chandra Shekhar Reddy: అల్లు అర్జున్ అరెస్ట్ విషయం దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది. ఈయన అరెస్టుతో ఒక్కసారిగా అభిమానులు చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ కి గురి అయింది కొన్ని గంటల హంగామా తర్వాత అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా అల్లు అర్జున్ బయటకు రావడంతో కుటుంబ సభ్యులు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు, డైరెక్టర్లు నిర్మాతలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన అల్లుడు అరెస్టు కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ మామ స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ నేత అనే విషయం మనకు తెలిసిందే . అయినప్పటికీ తన అల్లుడిని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా రేవంత్ తీరుపై మండిపడ్డారు.
ఇక తన అల్లుడు బెయిల్ మీద బయటకు వచ్చేవరకు ఈయన కూడా తన పోలీస్ స్టేషన్ కోర్టు అంటూ తిరుగుతూనే ఉన్నారు. ఇక తన అల్లుడు క్షేమంగా బయటకు రావడంతో చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ..మన భారత రాజ్యంగం ప్రకారం.. జ్యుడిషియరీ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. న్యాయం అనేది 100 శాతం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే బెయిల్ ఇచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా అల్లు అర్జున్ బయటకు రావాలని ఆయన అభిమానులు బలంగా కోరుకొని దేవుడిని ప్రార్థించారు ఆ ప్రార్ధనల వల్లే అల్లు అర్జున్ క్షేమంగా బయటకు వచ్చారు అంటూ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఇండియన్ జ్యుడిషియరీ అనేది చాలా న్యాయమైన జ్యుడిషియరీ. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో తన కూతురు స్నేహ మనవడు మనవరాలు చాలా బాధపడ్డారు. ఇలా కుటుంబంలో వ్యక్తికి జరిగితే ఎవరైనా బాధపడతారు కానీ అభిమాని మరణం విషయంలో అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా తనని అరెస్టు చేయడం న్యాయం కాదు అంటూ కూడా ఈయన మాట్లాడారు.