కొడంగల్ లో మళ్లీ టెన్షన్ (వీడియోలు)

మొన్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, నాయిని నర్సింహ్మారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కొడంగల్ లో పర్యటించినప్పుడు తీవ్రమైన టెన్సన్ వాతావరణం నెలకొంది. తాజాగా మరోసారి కొడంగల్ లో అదే పరిస్థితి నెలకొంది. ఈసారి మంత్రి జూపల్లి పర్యటించారు. ఆయన పర్యటనలోనూ టెన్షన్ క్రియేట్ అయింది.

హబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలం మొమినపుర్ గ్రామంలో రైతు బంధు చెక్కులు పంపిణీ కోసం మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. సభ లో  ప్రొటోకాల్ పాటించాలని చెప్పినందుకే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నరసింహ ను మరియు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అసభ్య పధజాలంతో దూశించారు. వారిని అరెస్ట్ కూడా చేశారు. సర్పంచుల పదవి కాలం ముగిసినా సరే ఎంపిటిసిలు, జెడ్పీటిసిలకు అయినా ప్రొటోకాల్ పాటించరా అని ప్రశ్నించారు. వారిని  ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం నిర్వహించాలి అని అడిగినందుకు అరెస్ట్ చేస్తారా అని కాగ్రెస్ నాయకులు కార్యకర్తలు మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతల అరెస్టు వీడియోలు కింద ఉన్నాయి చూడండి.