కరోనా మహమ్మారి కారణంగా వలస కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ కు చెందిన రాము అనే ఒక వలస కార్మికుడు గర్భవతి అయిన తన భార్య ధన్వంతతో, పసిపిల్ల అయిన తన కుమార్తె అనురాగినితో కలిసి గత కొంత కాలంగా హైదరాబాద్ లో నివాసముంటున్నాడు. బతుకు తెరువు కోసం వలసజీవిగా అతని జీవితం సాగుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక అవస్థలు పడలేక హైదరాబాద్ నుంచి తన స్వగ్రామానికి పయనమయ్యాడు. తన సొంత గ్రామం మధ్య ప్రదేశ్ కు చెందిన బాలాఘాట్. అంటే హైదరాబాద్ నుంచి అతడి 700 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో కాలినడకన తన గ్రామానికి చేరడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అతను తన కుమార్తె, గర్భిణీ భార్యను 700 కిలోమీటర్ల దూరాన్ని చేర్చడానికి చెక్కలతో ఒక తోపుడు బల్లని సిద్ధం చేసుకొని, తన గర్భిణీ భార్య, బిడ్డతో సహా ఆ తోపుడు బల్ల సహాయంతో బాలాఘాట్ జిల్లాలోని తమ గ్రామానికి పయనం సాగించాడు. అయితే అతను, తన భార్య బిడ్డను తోపుడు బల్ల పై లాక్కుంటూ రావటం చూస్తే మనకు కన్నీరు రాక మానదు.
కానీ ఏం లాభం.. మహారాష్ట్ర గుండా తమ సొంత జిల్లాలోకి ప్రవేశించగానే సబ్ డివిజనల్ ఆఫీసర్ నితేష్ భార్గవ నేతృత్వంలోని పోలీసు బృందం వారిని వైద్య పరీక్షల నిమిత్తం 14 రోజులు పాటు హోం క్వారంటైన్ లో ఉంచారు. పాపం అంత కష్టపడినా సొంత ఊరును చేరుకోలేకపోయారు .
|