వ్యూవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్…ఇక పై ఫ్రీగా ఆ వీడియోలు చూడవచ్చు..?

యూట్యూబ్ తన ఆదాయం పెంచుకొనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రీమియం సభ్యత్వానికి ఎక్కువమంది వినియోగదారులను తీసుకురావడానికి కొత్త మార్గాలను ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రీమియం సభ్యుల కోసం ప్రత్యేకంగా 4K కంటెంట్‌ను రూపొందించే ట్రయల్‌ని ఇటీవల ప్రారంభించింది. అయితే 4K ప్రయోగం గురించి ప్రేక్షకుల నుండి ప్రతికూల అభిప్రాయాలు వెలుపడ్డాయి. అందువల్ల ఈ 4కే ప్రయోగం నిలిపివేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది.

యూట్యూబ్ వీక్షించే చాలామంది వినియోగదారులు 4k ట్రయాల్ ని అంగీకరించకపోవడం వల్ల ఈ 4k ట్రయల్ నిలిపివేయమని పేవాల్ లో యూట్యూబ్ ని అభ్యర్థించారు. అయితే యూట్యూబ్ లో 4 k క్వాలిటీ వీడియోలు చూడటానికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి అంటూ వస్తున్న వార్తలపై యూట్యూబ్ స్పందించి… ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కస్టమర్ కి ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో 4 k ప్రయోగాన్ని పూర్తిగా విరమించుకున్నట్లు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది.

ఈ క్రమంలో ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేకుండానే ఫ్రీగా 4k క్వాలిటీ వీడియోలు చూసే అవకాశాన్ని యూట్యూబ్ వీక్షకులకు కల్పించింది. అయితే ప్రీమియం వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 4k కంటెంట్‌ను రూపొందించిన విషయం గురించి యూట్యూబ్ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు తొలగించబడిన ట్వీట్ల శ్రేణిలో “ప్రీమియం & నాన్-ప్రీమియం వీక్షకుల కోసం ఫీచర్ ప్రాధాన్యతలను” అన్వేషిస్తున్నట్లు YouTube ధృవీకరించింది.