హీరోగా హర్ష సాయి ఫస్ట్ సినిమా టైటిల్ టీజర్ ఎలా ఉందంటే.. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యూట్యూబ్ సెన్సేషన్ అయినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి కోసం తెలియని వారు ఉండరు. మెయిన్ గా యూత్ లో అయితే తనకు ఉన్న కల్ట్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మరి అలాంటి ఈ యూట్యూబ్ స్టార్ ఎప్పుడు నుంచో హీరోగా మారబోతున్నాడు అనే టాక్ ఉంది.

అంతే కాకుండా తన ఫస్ట్ సినిమాని తానే దర్శకత్వం వహించుకుంటున్నాడు. ఇన్ని రోజులు యూట్యూబ్ లో ఎమోషనల్ వీడియోస్ తో రాణించిన తాను ఇప్పుడు “మెగా లో డాన్” గా రాబోతున్నాడు. కాగా ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఓ క్రేజీ కాన్సెప్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. టాలీవుడ్ సహా కోలీవుడ్ లో మెయిన్ పి ఆర్ లతో ఈ టీజర్ ప్రమోషన్స్ చేస్తుండగా ఈ టీజర్ ఒకింత డిఫరెంట్ గా ఉంది కానీ హాలీవుడ్ నుంచి లేపేసిన కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది.

కాగా తన రోల్ కి తానే ఓ రేంజ్ ఎలివేషన్ ని డైలాగ్స్ ని బాగా రాసుకున్నాడు. అయితే ప్రపంచంలోనే అత్యంత బలమైన సొర చేప మెగ్ లోడన్ తో తనని తాను పోల్చుకుంటూ ఈ వీడియో రిలీజ్ చేశారు. అలాగే గంట కాన్సెప్ట్ వరకు బాగుంది కానీ ఈ మెగ్ కాన్సెప్ట్ అనేది హాలీవుడ్ లో ఆల్రెడీ రెండు సినిమాలు వచ్చాయి.

దానితో తనని కంపేర్ చేసుకున్నాడు. ఇక పైగా రీసెంట్ గా వచ్చిన “మెగ్ 2” నుంచి కూడా ఓ క్లిప్ లేపేసి ఈ వీడియోలో పెట్టుకున్నారు. అయితే హర్ష సాయి ప్రెజెన్స్ ఇందులో బాగుంది. 2024లో అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది చూడాల్సిందే. 
MEGA- Telugu movie title teaser | Harsha Sai | Mitraaw | Shree pictures