అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్… డిలీట్ మెసేజ్ లను కూడా ఇలా చూడొచ్చు!

టెక్నాలజీ పెరగడంతో సోషల్ మీడియా కూడా బాగా అభివృద్ధి చెందింది ఈ క్రమంలోనే అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఆధారంగా వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లను తీసుకువస్తూ ఎన్నో యాప్స్ వినియోగదారులను సందడి చేస్తున్నాయి.
ఇక ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది వాట్సాప్ సంస్థ.

ఈ నేపథ్యంలోనే మరో ఫీచర్ ని కూడా పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ..సాధారణంగా మనం వాట్సాప్ లో కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్లను డిలీట్ చేస్తూ ఉంటాం అయితే అలాంటి ఇంపార్టెంట్ మెసేజ్ లో డిలీట్ అయినప్పుడు ఎంతో కంగారు పడుతూ ఉంటారు ఇకపై ఆ కంగారు కూడా అవసరం లేదని డిలీట్ అయినటువంటి మెసేజ్లను కూడా చూసే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

గూగుల్‌ స్వయంగా ఆండ్రాయిడ్‌లో విలీనం చేసిన ఓ ఫీచర్‌ ద్వారా డిలీటెడ్‌ మెసేజెస్‌ తెలుసుకోవచ్చు. తొలగించిన లేదా డిస్‌మిస్డ్‌ చేసిన రీసెంట్‌ నోటిఫికేషన్‌లను నోటిఫికేషన్ హిస్టరీలో స్టోర్‌ అయి ఉంటాయి. మెసేజ్‌ నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు పక్కకు స్వైప్‌ చేస్తే అది నోటిఫికేషన్ హిస్టరీ ట్యాబ్‌ లోకి వెళ్తుంది. మనం ఇలాంటి మెసేజ్లను కూడా చూడవచ్చు. ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేసి, నోటిఫికేషన్స్‌ కి వెళ్లాలి. ఆ తరువాత అందులో నోటిఫికేషన్స్‌ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత నోటిఫికేషన్ హిస్టరీని ఎనేబుల్‌ చేసుకోవాలి. అప్పుడు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లలో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను చూడవచ్చు. డిలీటెడ్‌ మెసేజ్‌లు ఈ ట్యాబ్‌లో 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇలా 24 గంటల్లోపు అయితే డిలీట్ అయిన మెసేజ్లను కూడా చూడవచ్చు లేదా అవి కూడా పేర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి.