వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త… ఈ తప్పు చేస్తే వాట్సప్ బ్యాన్!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇలా స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారు తప్పనిసరిగా వారి మొబైల్ ఫోన్లో వాట్స్అప్ అనేది తప్పనిసరి అయింది.ఇలా వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అప్డేట్ చేస్తూ ఎంతో మంది యూజర్లను సంపాదించుకుంది. అయితే వాట్సాప్ కొని నియమ నిబంధనలు కూడా అమలులోకి తీసుకువచ్చారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక వారికి వాట్సాప్ గట్టి షాక్ ఇవ్వబోతోంది.

పొరపాటున కూడా వాట్సాప్ యూజర్స్ తెలిసి తెలియక ఈ తప్పులు కనుక చేస్తే వారికి వాట్సప్ బ్యాన్ విధించబోతుందని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ఒక ఆఫీసులో లేదా ఏదైనా జాబ్లో ఉన్న, ఏదైనా వ్యాపారం చేసే వారందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసే సమయంలో తప్పనిసరిగా వారి అనుమతి తీసుకుని వారిని గ్రూప్ లో యాడ్ చేయవలసి ఉంటుంది.

ఇక వాట్సప్ లో మీకు తెలిసిన మీతో మాట్లాడాలనుకునే వారికి మాత్రమే మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వినియోగదారుల నుంచి పదేపదే మరొక వినియోగదారుడుకి ఒకే మెసేజ్ ఫార్వర్డ్ చేయటం వల్ల వాట్సప్ వారిపై చర్యలు తీసుకొని వారి ఖాతాను బ్యాన్ చేయనుంది. ఇలా పై తెలిపిన నిబంధనలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై వాట్సాప్ బ్యాన్ విధించనుంది.