సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. అయితే వీరికి మాత్రమే వెసులుబాటు?

స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారుడు తప్పనిసరిగా వాట్సాప్ ఉపయోగిస్తూ ఉంటారు.వాట్సప్ ద్వారా ఎన్నో విలువైన డాక్యుమెంటరీలను ఎంతో సులభంగా ఒకరి నుంచి మరొకరికి పంపించడం జరుగుతుంది. ఇకపోతే ప్రతినెల సరికొత్త ఫీచర్ వినియోగదారుల కోసం వాట్సాప్ అప్డేట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా వాట్సాప్ తాజాగా వినియోగదారుల కోసం మరొక అప్డేట్ తీసుకువచ్చింది.

వాట్సాప్ అప్డేట్ చేసిన ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. క్యాప్షన్ పేరుతో కొత్త అప్‌డేట్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా ఇమేజస్, వీడియోస్, GIFs, డాక్యుమెంట్స్ వంటి వాటిని క్యాప్షన్‌తో ఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉంటుంది.ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే.. యూజర్లు ఫోటో, వీడియో, GIF, డాక్యుమెంట్స్‌ను ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. కొత్త ఆప్షన్ డ్యూ కనబడుతుంది దీంతో మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ లేదా ప్రొఫైల్ పంపించేటప్పుడు క్యాప్షన్స్ ద్వారా పంపించవచ్చు.

ఇకపోతే వాట్సాప్ అప్డేట్ చేసిన ఈ ఫీచర్ అన్ని స్మార్ట్ ఫోన్ లకి వర్తించదు. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు iOS, Androidలో అందరికీ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. iOS 22.23.0.72 వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన యూజర్లు కొత్త ఫీచర్‌ను పొందవచ్చు.