మరొక కొత్త ఫీచర్ తో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సప్..?

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు తన వినియోగదారుల అవసరాల మేరకు ఎప్పటికప్పుడు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వాట్సాప్ iOS యూజర్ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ అనే కొత్త ఫీచర్ ని రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ కొత్త అప్డేట్ లో విడుదల చేసింది. గతంలో బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. కాగా ఇప్పుడు స్టేబుల్ వెర్షన్ వాడుతున్న యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఈ మోడ్ వాట్సాప్ కాల్స్ కు ఎటువంటి అంతరాయం కలిగించకుండా వీడియో కాల్ సమయంలో మల్టీ టాస్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో వివరిస్తూ వాట్సాప్ బీటా ఇన్ఫో ఒక స్క్రీన్ షాట్ కూడా పంచుకుంది. ఈ స్క్రీన్ షాట్ లో మీరు వీడియో కాల్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ లో కనిపించడం మనం గమనించవచ్చు. యాపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్ ని అప్డేట్ చేయడం ద్వారా మీ అకౌంట్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో మీరు తెలుసుకోవచ్చు.

కొత్త అప్డేట్ లో డాక్యుమెంట్లకు క్యాప్షన్లను జోడించగల సామర్థ్యం, లంగర్ గ్రూప్ డిస్క్రిప్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక మరి కొద్ది రోజుల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ తాజా ఫీచర్లను పొందడానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ఇకపోతే వాట్సప్ ద్వారా చాటింగ్ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ద్వారా ఇతరులతో ఈజీగా కమ్యూనికేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇటీవల వాట్సాప్ డిజిటల్ పేమెంట్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చింది. ఇలా నిత్యం వాట్సాప్ యూజర్స్ కి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తూ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో వాట్సాప్ గెలిచింది. ఇప్పటికే చాలా సంస్థలు వాట్సాప్ తోటి కలిసి తమ సేవలను అందజేస్తున్నాయి..