ప్రస్తుత కాలంలో వాట్స్అప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్స్అప్ తప్పకుండా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మరి కొంత మంది రెండు స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉంటారు. అలాంటివారు రెండింటిలోనూ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక్కో నెంబర్ తో ఒక వాట్సాప్ అకౌంట్ మాత్రమే వినియోగించగలం. కానీ ఇప్పుడు ఒకే నెంబర్ తో రెండు ఫోన్లలో వాట్సప్ ఉపయోగించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అయితే ఒకే నెంబర్ మీద రెండు ఫోన్లలో వాట్సప్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• మొదట ఒక స్మార్ట్ ఫోన్లో ఒక నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసి ఉపయోగించిన తర్వాత కూడా మరొక ఫోన్లో అదే నెంబర్ మీద వాట్సాప్ ఓపెన్ చేయడానికి మొదట ఆ రెండవ ఫోన్లో వాట్స్అప్ డౌన్లోడ్ చేయాలి.
• ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి మొదటి ఫోన్ లో వాట్సాప్ ఉన్న(మీ ప్రైమరీ అకౌంట్) ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
• ఆ తర్వాత మెనూ లోకి వెళ్లి ఇక్కడ డిస్‌ప్లే అయ్యే ఆప్షన్స్ నుంచి ‘లింక్ డివైజ్అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
• ఇక ఇప్పుడు మీ మొదటి ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి.. త్రీ డాట్స్ మెనూ మీద క్లిక్ చేసి అక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
• ఈ లిస్ట్‌లో డిస్‌ప్లే అయ్యే ఆప్షన్స్ నుంచి ‘లింక్‌డ్ డివైజెస్’ ఆప్షన్ క్లిక్ చేసి , తర్వాత ‘లింక్ ఎ డివైజ్’ పై ట్యాప్ చేయండి.
• ఇప్పుడు రెండో ఫోన్‌లో చూపిస్తున్న QR కోడ్‌ను మొదటి ఫోన్ ద్వారా స్కాన్ చేసి,రెండింటిలో చాట్ సింక్ అయ్యే వరకు వేచి చూడండి. పూర్తయ్యాక మీరు రెండు డివైజ్‌లలో ఒకే వాట్సాప్‌ని ఒకే సమయంలో వినియోగించొచ్చు.
• వాట్సాప్ వెబ్’ ఫీచర్ ద్వారా మొబైల్, లాప్టాప్ లో ఎలా వాట్సప్ ఉపయోగిస్తామూ అలాగే రెండు వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను మేనేజ్ చేయొచ్చు.