ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యప్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఫేస్ బుక్ వాడుతున్నారు. అయితే మీ ఫేస్ లో సమాచారంతో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ఫేస్బుక్ ప్రొఫైల్ దుర్వినియోగం కాకుండా ఉండటానికి మీ ప్రొఫైల్ ను ఎవరైనా చూస్తున్నారా అనే విషయాన్ని మీరు సులువుగా కనిపెట్టవచ్చు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఎవరైనా చూస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఇలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
• ముందుగా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో మీ ఫేస్బుక్ ఓపెన్ చేసి లాగిన్ కావాలి. ఇక పేజీ ఓపెన్ అయిన తర్వాత ‘రైట్ క్లిక్’ చేయాలి. అందులో ‘వ్యూ పేజ్ సోర్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దానిపై క్లిక్ చేయాలి.
• అలా చేసిన వెంటనే పేజీ సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది. అందులో ‘BUDDY_ID’ కోసం వెతకాలి. ఇందుకోసం కంట్రోల్+ఎఫ్ (ctrl+F) నొక్కి ‘BUDDY_ID’ అని టైప్ చేయాలి.
• ఇలా ‘BUDDY_ID’ పక్కన అనేక ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక ఐడీని కాపీ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త ట్యాబ్ను ఓపెన్ చేసి ‘Facebook.com/ మీరు ఎంచుకున్న ఐడీ’ని పేస్ట్ చేయాలి.
• ఇలా చేయగానే మీ పేస్ బుక్ ప్రొఫైల్ ను ఎవరు చూసారో అనే వారి పేజీ ఓపెన్ అవుతుంది. ఈ ట్రిక్ ద్వారా ఫేస్ బుక్ లో మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో వారికి కూడా తెలియకుండా ఇలా సింపుల్గా తెలుసుకోవచ్చు..