వాలెంటైన్స్ డే స్పెషల్.. ఐఫోన్‌ 12 మినీ పై ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే ఆఫర్..?

కాలంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలో కొత్త కొత్త ఫీచర్లతో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి కంపెనీలు పండుగలు ప్రత్యేక సందర్భాలలో స్మార్ట్ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. ఇక ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ 12 మినీ పై ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ మొబైల్ కంపెనీ యాపిల్ ఐఫోన్‌ 12 సిరీస్‌లో ఓ మినీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్‌లతో , తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ కావాలని కోరుకునే ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు మరింత తక్కువ ధరకు దక్కించుకునే అవకాశాన్ని కల్పించింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్‌ 12 మినీ మొబైల్ మీద డిస్కౌంట్ లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఈ స్పెషల్‌ డీల్‌ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐఫోన్‌ 12 మినీ ప్రారంభ ధర రూ.69,900. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఐఫోన్‌ 12 మొబైల్ రూ.17,901 డిస్కౌంట్‌తో రూ.41,999 తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో 12 మినీ ధర రూ.39,900కి తగ్గింది. అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ.20,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇలా అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్‌ 12 మినీని ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.19,900కి సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఐఫోన్ 12 సిరీస్‌లోని మోడల్స్‌లో ఉన్న అన్ని ఫీచర్స్‌ 12 మినీలో కూడా ఉంటాయి. ఇందులో 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. అలాగే 12MP ట్రూ డెప్త్‌ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.ఇక ఈ మినీ స్మార్ట్ ఫోన్ A14 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది.