భారతీయ పౌరులకు తప్పనిసరిగా ఉండాల్సిన కార్డులలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఎందుకంటే ఈ ఆధార్ కార్డ్ దేశంలో ప్రతి పౌరునికి గుర్తింపు కార్డు. ఒక్క ఆధార్ కార్డు వల్ల ఎన్నో పనులు జరుగుతాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుండి వివిధ రకాల సేవలను పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి. అందువల్ల ప్రజలందరూ తమ ఆధార్ కార్డులోని పేరు, చిరునామా వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అయితే ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో UIDAI కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి వీలు లేదు. ఆధార్ కార్డు ఏ ఏ సందర్భాలలో ఎన్నిసార్లు అప్డేట్ చేయాలి, వాటికి ఎంత రుసుము చెల్లించాలి అన్న పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం.
కొన్ని ఆధార్ కార్డు సెంటర్లలో ప్రజలను మోసం చేస్తూ అధిక మొత్తంలో రసము వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు మోసపోకుండా ఏ అప్డేట్ కోసం ఎంత రుసుము చెల్లించాలో UIDAI నిర్దేశించింది. ఆధార్ వివరాలు అప్డేట్ చేయించడానికి చెల్లించాల్సిన రుసుము వివరాలు :
• డెమోగ్రాఫిక్ అప్‌డేట్ రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
• బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం రూ. 100 ఫీజ్ చెల్లించాలి.
• ఇక బయోమెట్రిక్ విత్ డెమోగ్రాఫిక్ అప్‌డేట్ చేయించటానికి రూ. 100 చెల్లించాలి.
• అలాగే A4 షీట్‌పై ఆధార్ డౌన్‌లోడ్, కలర్ ప్రింట్-అవుట్ కోసం ఒక్కో ఆధార్‌కు రూ.30 చెల్లించాలి.
ఆధార్ కార్డు లో పేరు చిరునామా వంటి వివరాల అప్డేట్ :
• UIDAI నిబంధనల ప్రకారంప్రకారం ఆధార్ కార్డ్ హోల్డర్ తన పేరును కేవలం రెండుసార్లు మాత్రమే .
అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
• ఇక ఆధార్ కార్డులో డేటాఫ్ బర్త్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది.
• లింగ వివరాలను ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసుకోవచ్చు.
• ఇంతకు మించి ఎక్కువసార్లు అప్డేట్ చేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి .
• అలాగే పాన్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వాటితో ఆధార్ కార్డ్ తప్పనిసరిగా లింక్ చెయ్యాలి లేకుంటే చాలా నష్టాలు జరుగుతాయి.