దేశీయ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలను కస్టమర్లకు అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల సేవలను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చిన స్టేట్ బ్యాంక్ మరో అద్భుతమైన సేవలను కస్టమర్లకు అందించడానికి సిద్ధమైంది.అయితే స్టేట్ బ్యాంకులో మనకు అకౌంట్ కనక ఉన్నట్లయితే దానిని ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కు మార్చుకోవాలి అంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంది.
ఇప్పుడు ఇలాంటి కష్టాలు ఏమీ ఉండవని తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారానే మనం ఒక బ్రాంచ్ నుంచి మనకు కావాల్సిన బ్రాంచ్ కి మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ ద్వారా మన అకౌంట్ ఏవిధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయానికి వస్తే… ముందుగా మనం ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇ-సర్వీస్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి.
మనకు ఒకటి కంటే ఎక్కువగా అకౌంట్ నెంబర్స్ ఉన్నట్లయితే మనం ఏ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాము ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ తో పాటు బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ని కూడా ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు కన్ఫామ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మన మొబైల్ నంబర్ కి ఓటీపీ కూడా వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే చాలు ఇక యోనో యాప్ ద్వారా కూడా మార్చుకోవచ్చు.