దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆధార్ కార్డ్ అనేది మనిషికి ఒక గుర్తింపు కార్డు లాంటిది. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ రంగ పనులను పూర్తీ కావు. స్కూల్ అడ్మిషన్ దగ్గర నుండి రేషన్ తీసుకునే వరకు ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు వంటి ముఖ్యమైన వాటికి ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆధార్ కార్డు లాగే ప్రతి వ్యక్తికి పాన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి. దానికా పేద అని తేడా లేకుండా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ పాన్ కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలి. పాన్ కార్డు చేయించుకున్న తర్వాత దానికి ఆధార్ నెంబర్ కూడా తప్పనిసరిగా లింక్ చేయించాలి.
ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే పాన్ కార్డు ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందువల్ల పాన్ కార్డుకి ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. మొదట ఆధార్ పాన్ కార్డు అనుసంధానం పొట్టి ఉచితంగా చేసేవారు. కానీ చాలామంది ప్రజలు ఇలా ఆధార్ కార్డుని పాన్ కార్డుతో లింక్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 61కోట్ల మందికి పాన్ కార్డులను విడుదల చేయగా.. కేవలం48 కోట్ల మంది ఆధార్ తో పాన్ ను లింక్ చేసుకున్నారు.
ఆధార్ కార్డు ని పాన్ కార్డుతో లింక్ చేయనివారు వెయ్యి రూపాయలు రుసుమ చెల్లించి వాచి 31వ తేదీలోగా లింక్ చేయించాలి. అలా చేయని యెడల పాన్ కార్డు డి ఆక్టివేట్ అవుతుంది. పాన్ కార్డు డి ఆక్టివేట్ చేయడం వల్ల లావాదేవీలు జరపటానికి వీలు ఉండదు. అందుకే మార్చి 31 వరకు ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవాలని కేంద్రం ప్రజలకు సూచిస్తుంది. ఇదివరకే పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసిన వారు ఆధార్ నెంబర్ పాన్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవటానికి ఈ లింక్ ఓపెన్ చేయాలి. https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar అనే లింక్ ఓపెన్ చేసి పాన్ కార్డు వివరాలు నమోదు చేస్తే ఆధార్ నెంబర్ పాన్ కార్డుకి లింక్ అయిందో లేదో మనం తెలుసుకోవచ్చు.