భారతదేశంలో నివసించే ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆధార్ కార్డు ప్రతి పౌరునికి ఒక గుర్తింపు కార్డు వంటివి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరగాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఐదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రుల ఆధార్ కార్డు డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఐదేళ్లు నిండిన పిల్లలకు స్వతహాగ ఒక ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే పిల్లలకు ఆధార్ కార్డు అప్లై చేయడానికి మీసేవ సెంటర్ కి వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఆధార్ కార్డు పొందవచ్చు.
ఐదు సంవత్సరాలు వయసు నిండిన పిల్లలకు ఆధార్ కార్డు చేయించడానికి తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ కి వెళ్లి కష్టపడాల్సిన పని లేదు. పిల్లలకి ఆధార్ కార్డు చేయించడానికి తల్లి తండ్రి ఆధార్ కార్డుతో పాటు సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకొని దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ కి వెళితే చాలు మీ పిల్లల ఆధార్ కార్డు తయారవుతుంది. ప్రస్తుతం ఆధార్ సేవలను ప్రభుత్వం పోస్ట్ మాన్ లకు అప్పగించింది. అందువల్ల తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ తో పాటు మొబైల్ నెంబర్ తీసుకుని దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్టుమాన్. ని సంప్రదించినట్లయితే వారు స్వయంగా మీ ఇంటికి వచ్చి ఇంట్లోనే పిల్లల ఆధార్ కార్డు అప్లై కి సంబంధించిన అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటారు.
పిల్లల ఆధార్ కార్డు కోసం ఆధార్ సెంటర్ కి వెళ్లి కష్టపడాల్సిన పని లేకుండా కేవలం పోస్ట్ మ్యాన్ ని సంప్రదించటం వల్ల సులభంగా పిల్లల ఆధార్ కార్డు తయారు అవుతుంది. పిల్లల ఆధార్ కార్డుకి సంబంధించిన పనులు మాత్రమే కాకుండా పెద్దల ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయవలసి ఉన్నా కూడా పోస్ట్ మ్యాన్ ని సంప్రదించాలి. అయితే ఈ సదుపాయాన్ని పొందటానికి పాక్షికంగా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే పిల్లల ఆధార్ కార్డు అప్లై చేయడానికి అలాగే పెద్దల ఆధార్ కార్డులో మార్పులు చేయటానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది.