మీ స్మార్ట్ ఫోన్ హ్యక్ అయ్యిందని తెలిపే సూచనలు ఇవే..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా బాగా
తెలియగానే ఏం చేయాలి..? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకుండా ఫోన్ తనకుతానే అప్డేట్ అవడం, లేదా మొబైల్ లో ఉన్న సమాచారం మొత్తం డిలీట్ అవుతూ ఉంటుంది.అంతే కాదు కొన్ని సార్లు మీ ఫోన్ పని చేయడం మానేస్తుంది. ఇలాంటి సమయంలో మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని అర్థం.

• అలాగే మీరు డెటా ఉపయోగించనప్పటికీ.. డేటా పోతుంది. అలాంటి సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ లో ఉన్న డేటా బదిలీ చేయబడిందని అర్థం చేసుకోండి. మొబైల్ ఫోన్ హ్యక్ చేసి అందులో ఉన్న ఇంపార్టెంట్ డేటా తీసుకుంటారు.

• అలాగే ఫోన్ నుంచి కాల్ డయల్ చేయబడి.. ఒకే నంబర్‌కు పదేపదే కాల్ చేయబడినా కూడా మీ ఫోన్ హ్యాక్ చేసినట్లు గుర్తించవచ్చు. అప్పుడు మీరు వెంటనే స్మార్ట్‌ఫోన్‌ను షట్ డౌన్ చేస్తే అప్పుడు సమస్య నుంచి బయట పడవచ్చు.

• మీ ఫోన్ లో మీరు ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు మరో యాప్ ఓపెన్ అయితే ఆ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని గమనించాలి.

• మీ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా షట్ డౌన్ అవ్వటం లేదా దాని డిస్ప్లే మళ్లీ మళ్లీ ఆన్, ఆఫ్ అవుతూ ఉంటే.. మీ హ్యాక్ చేయబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది గమనించి వెంటనే మీ ఫోన్ ఆఫ్ చెయ్యలి..లేకుంటే మాత్రం మీ విలువైన సమాచారం ని హ్యక్ చేస్తారు.