ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తర్వాత ప్రజలందరూ కూడా డిజిటల్ పేమెంట్ ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంలో షాపింగ్ హోటల్స్ కి వెళ్లిన ఆన్లైన్ టికెట్స్ కోసం ఇలా ప్రతిదానికి ఆన్లైన్లో డబ్బులు పే చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుత కాలంలో బ్యాంక్ కు వెళ్లే అవసరం లేకుండా పోయింది. అయితే కొంతమంది డబ్బు డ్రా చేయడానికి కూడా బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా ఏటీఎం ద్వారా నిమిషాలలోనే డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఇలా ఏటీఎం ల ద్వారా డబ్బులు డ్రా చేయటం ఎంతో సులువుగా మారిపోయింది. కానీ ఏటీఎం ల వల్ల కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో స్ట్రక్ అవ్వటం, అలాగే పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బులు అకౌంట్ నుండి కట్ అయి కూడా బయటికి రాకపోవడం… నెట్‌వర్క్ సమస్య వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం.
అంతే కాకుండా మరి కొన్ని సందర్భాలలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కూడా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలియక చాలమంది టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే జరిగినప్పుడు ఆందోళన చెందకుండా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేసి మీరు ఆ సమస్యని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.అలా కాకపోతే మీరు కస్టమర్ కేర్ నంబర్‌కు ఫిర్యాదు చెయ్యచ్చు.ఇలా కస్టమర్ కేర్ ద్వారా బ్యాంకులో కంప్లైంట్ ఇవ్వటం వల్ల కొద్ది రోజుల్లోనే ఆ అమౌంట్ ని రిఫండ్ చేస్తాయి. ఒకవేళ కనుక టైం లో వీటిని రిఫండ్ చెయ్యకపోతే బ్యాంకులు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాల్సి వుంది. ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేయటానికి https://cms.rbi.org.in వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు కంప్లైంట్ చేయొచ్చు.