Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా.? వీటిని ట్రై చేయాల్సిందే మరి.!

Smartphone Tips: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ చేసే మొదటి సమస్య స్టోరేజ్. మొబైల్‌ ఫోన్‌ స్టోరేజ్‌ అనేది ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం.. అయితే దీనికి చెక్‌ పెట్టడానికి పలు ఆన్‌లైన్‌ స్టోరేజ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఈ క్రమంలో కొన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోరేజ్‌ సేవలు ముందుకి వచ్చాయి.

మొబైల్‌లో క్యాచీ మెమొరీ పెరగడం, డేటా నిండిపోవడం కారణమం ఏదైనా పదే పదే మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందంటూ అలర్ట్ వస్తుంది. అయితే ఫోన్‌లోనే కాకుండా క్లౌడ్‌లో కూడా స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉందని ఎంత మందికి తెలుసు? అలా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్‌లు వచ్చాయి. మరి అవి ఏంటి.? ఎలా పనిచేస్తాయి.? అనేది తెలుసుకుందాం.

Google Drive: గూగుల్ తమ యూజర్లకు డేటా స్టోర్ చేసుకోవడం కోసం ఈ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మొదట 15 జీబీ వరకు ఉచితంగా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రూ. 150లతో 100 జీబీ డేటా వరకు క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

Amazon Drive: డేటా స్టోరేజ్ కోసం అమేజాన్ కూడా స్టోరేజ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఫోటోలు, వీడియోలను స్టోర్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌ డ్రైవ్‌లో 5జీబీ వరకు డేటాను ఉచితంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇక అన్‌లిమిటెడ్‌ డేటాను స్టోర్‌ చేసుకోవాలనుకునే వారు ఏడాదికి రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది.

Dropbox: ప్రముఖ స్టోరేజ్‌ సర్వీసెస్‌లో డ్రాప్‌ బాక్స్‌ ఒకటి. ఇందులో 2 జీబీ వరకు ఉచితంగా డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు. నెలకు రూ. 1200 చెల్లించడం ద్వారా 2 టీబీ వరకు డేటాను స్టోర్‌ చేసుకునే అవకాశం కల్పించారు డ్రాప్ బాక్స్ సర్వీసెస్. అంతేకాకుండా ఒకేసారి ఆరుగురు సభ్యులు వాడుకునే అవకాశం కూడా కల్పించారు.

OneDrive: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. వన్‌డ్రైవ్‌ పేరుతో క్లౌడ్‌ స్టోరేజ్‌ సేవలను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఇందులో యూజర్లు 5జీబీ వరకు ఉచితంగా డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెలకు 6.99 డాలర్లను చెల్లిస్తే 1 టీబీ డేటాను స్టోర్ చేసుకోవచ్చు.

Next cloud: ఆన్‌లైన్‌ డేటా స్టోరేజ్‌ సర్వీసెస్‌లో ఇంకోటి నెక్ట్స్‌ క్లౌడ్‌. ఈ స్టోరేజ్‌ సర్వీస్‌ రెసిలియోసింక్ యాప్‌లా పని చేస్తుంది. అయితే ఇది కంప్యూటర్, ఫోన్ మధ్య ఫైల్స్‌ను పర్సరం అనుసంధానించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్‌ క్లౌడ్‌ సర్వర్‌లో మీ క్లౌడ్‌ స్టోరేజ్‌ సపరేట్‌గా ఆన్‌లైన్‌లో ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.