వాట్సాప్ లో నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ ఎలా పంపించాలో తెలుసా?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ యూస్ చేస్తున్నారు. ఇలా వాట్సాప్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.అయితే మనం వాట్సప్ నుంచి ఒక వ్యక్తికి ఏదైనా మెసేజ్ పంపించాలంటే తప్పనిసరిగా వారి నెంబర్ సేవ్ చేసుకొని పంపించాల్సి ఉంటుంది. అయితే ఇకపై నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించే వెసులుబాటును వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలా నెంబర్ సేవ్ చేయకుండా ఇతరులకు వాట్సప్ మెసేజ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

ముందుగా మన ఫోన్ లోకి వెళ్లి ప్లే స్టోర్ లో అప్డేటెడ్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం మెసేజ్ ఇవ్వా సెల్ఫ్ అనే ఆప్షన్ ద్వారా మనం నెంబర్ సేవ్ చేసుకోకుండా ఇతరులకు మెసేజ్ పంపించవచ్చు. అయితే ఈ నెంబర్ కి అయితే మీరు మెసేజ్ పంపించాలనుకున్నారో ఆ నెంబర్ ను మీకు మీరే పంపించుకోవాలి.ఇలా చేయడం వల్ల ఫోన్ నెంబర్ బ్లూ కలర్ లో ఉంటుంది అయితే ఈ బ్లూ కలర్ ఫోన్ నెంబర్ పై మనం ప్రెస్ చేయడం వల్ల చాట్ విత్ ఫోన్ నెంబర్, వాట్సాప్ కాల్, సేవ్ నెంబర్ అనే మూడు ఆప్షన్లు కనబడతాయి.

ఈ మూడు ఆప్షన్లలో చాట్ విత్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే చాట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ చాట్ విండో ద్వారా మనం ఆ నెంబర్ కి మెసేజ్ పంపించవచ్చు. ఈ చాట్ విండో ఆప్షన్ ద్వారా మనం కేవలం మెసేజ్ పంపించడమే కాకుండా నోట్స్, షాపింగ్ లిస్ట్, బుక్ మార్కులు, రిమైండర్లు లింక్ ఇమేజెస్ వీడియో వంటి వాటిని కూడా పంపించవచ్చు.