Vivo V23 Launch: అదిరిపోయే రెండు ఫ్రంట్ కెమెరాలతో వివో స్మార్ట్ ఫోన్లు

Vivo V23 Launch: టెక్ ప్రేమికులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వివో వి 23 సిరీస్ ఫోన్లు 2022 జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ కానున్నాయి. వివో వీ 23 ప్రో స్పెసిఫికేషన్స్ వివో వీ 23 ప్రో మొబైల్ విడుదలకు ముందే కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి.

వాటి ప్రకారం వివో వీ 23 ప్రో 2 ఫ్రంట్ కెమెరాలతో రానున్నది. వీటిలో 50 మెగా పిక్సెల్ ఐ ఆటో ఫోకస్ కెమెరా ప్రధాన హైలెట్ గా నిలవనున్నది. అలాగే ఈ ఫోన్ వెనుక 3 కెమెరాలు ఉండగా.. అందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉండనుంది. ఈ మొబైల్ అల్ట్రా థిన్ 3డీ కర్వ్ డ్ డిస్ ప్లే + 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ తో రానుంది.

అయితే డిస్ ప్లే సైజ్ పై పూర్తి స్పష్టత రాలేదు. ఇక ఈ మొబైల్ మీడియా టెక్ డైమంసిటీ 1200 5జీ ప్రాసెసర్ తో నడవనుంది. నేరుగా సూర్యరశ్మి తగిలిన సమయంలో ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగులు మారేలా వివో ఈ ఫోన్ డిజైన్ చేసినట్టు సమాచారం. సరికొత్త ఫీచర్స్ రానుండడంతో అందరి చూపు ఈ మొబైల్ పై పడింది.