మొబైల్ లో సేవ్ చేయని నెంబర్ కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాలా.. అయితే ఇలా చేయండి..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ లలో వాట్స్అప్ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్స్అప్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు నిద్ర మేలుకొని మరి వాట్సప్ లో చాటింగ్ చేయడం వీడియో కాల్స్ మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు. ఒక రోజులో ఎక్కువ సమయాన్ని కేవలం వాట్సాప్ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. ఇలా రోజురోజుకి వాట్స్అప్ పోయి ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ సంస్థ సరికొత్త టీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరొక కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

సాధారణంగా వాట్స్అప్ ద్వారా ఎవరికైనా మెసేజ్ చేయాలంటే మొబైల్లో ఆ నంబర్ సేవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ పంపే విధంగా సరికొత్త ఫీచర్ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ చేసే అవకాశం ఉంది. అయితే ఇలా థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌ చేయడం వల్ల మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. అయితే మొబైల్ లో నంబర్‌ సేవ్ చేయకుండా వాట్సప్ ద్వారా మెసేజ్ ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.

• మీ మొబైల్ లో నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపటానికి ముందుగా మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌ ఒపెన్‌ చేయండి.
• ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx అనే లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లో పేస్ట్‌ చేయాలి.
• ఇక ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
• మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌ ఎంటర్ చేసిన తరువాత మీరు వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.
• ఆ తర్వాత గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌ పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు షిఫ్ట్ అవుతారు. ఇలా మీరు నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్‌ చేయవచ్చును.