శామ్సంగ్ ఇండియాలో నెంబర్ 1, షియోమి పడిపోయింది

ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ మీద ఆధిపత్యం కోసం శామ్సంగ్, షియోమీ మధ్య చాలా గట్టి పోటీ నడిచింది.

అయితే, చివరకుఈ ఏడాది రెండో క్వార్టర్ లో శామ్సంగ్ షియోమీని దెబ్బ తీసి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుంది.

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ గ్రోత్ బాగా ఉంది. ఈ ఏడాది అది 18 శాతానికి చేరుకుంది. అందుకే ఇలాంటి మార్కెట్ లో లీడర్సిప్ కోసం  శామ్సంగ్, షియోమీల మధ్య పోటీ తీవ్రంగా మారింది. అయితే, 29 శాతం మార్కెట్ మీద పట్టు సాధించి శామ్సంగ్ ఇపుడు అగ్రస్థానానికి ఎదిగింది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో శామ్సంగ్ సాధించిన దానికంటే ఇది 5 శాతం ఎక్కువ.  అపుడు షియోమీ మార్కెట్ షేర్ 28శాతం ఉండింది. ఇపుడు వ్యవహారం తలకిందులయింది. శామ్సంగ్ 29 శాతంతో షియోమీని దెబ్బతీసింది.

మొదటి స్థానం కోసం జరిగిన పోటీలో ఒక  చైనా కంపెనీ పడిపోయినా,   మూడు నాలుగు అయిదు స్థానాలు, చిత్రంగా, చైనా కంపెనీలకే వెళ్లాయి. మూడో స్థానంలో  వివో (12 శాతం), ఒప్పో (10), నాలుగస్థానలో ఆనర్ (3 శాతం) ఉన్నాయి.