ప్రస్తుత కాలంలో స్మార్ట్ మొబైల్ వాడకం బాగా పెరిగిపోయింది. అందువల్ల స్పాట్ ఫోన్లో తయారు చేసే కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా కు చెందిన ప్రసిద్ధ రెడ్ మీ సంస్థ రక రకాల కొత్త కొత్త ఫీచర్లతో భారతదేశ మార్కెట్లోకి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి తెచ్చింది. ఇదిలా ఉండి తాజాగా రెడ్ మీ సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. రెడ్ మీ నోట్ 12 సిరీస్ ను అక్టోబర్ 27 న చైనా మార్కెట్ లో కొత్తగా లాంచ్ చేయనుంది . ఈ క్రమంలో రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో,రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్ లను విడుదల చేయనుంది షావోమి.
అయితే వీటిలో రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్ లతో విడుదల అయ్యింది. ఈ రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ కొత్త ఫీచర్స్ గురించీ తెలుసుకుందాం. రెడ్ మీ నోట్ 12 ప్రో ఫోన్ లో వెనక భాగంలో మూడు కెమెరాలతో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా లభించనుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో 210 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది.
రెడ్ మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.
ఈ కొత్త ఫీచర్స్ ఉన్న ఈ రెడ్ మీ నోట్ 12 ప్రో మొబైల్ ని తొందర్లోనే భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలలో కూడా లాంచ్ చేయనున్నారు. కాగా రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ను ఇండియాలో కూడా లాంచ్ కానుంది. ఇక రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్ లు కూడా భారత మార్కెట్ కు రానున్నాయి. కాగా ఆ స్మార్ట్ ఫోన్ లు స్పెసిఫికేషన్ లు, పేర్లతో వస్తాయా లేదంటే షావోమీ సంస్థ ఇంకా ఏమైనా మార్పులు చేస్తుందా అనేది చూడాలి మరి. ఈ విషయంపై రెడ్ మీ ఇంకా పూర్తి సమాచారాన్ని ప్రకటించాల్సి ఉంది.