చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది పోకో సంస్థ. ఆ వివరాల్లోకి వెళితే..
పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి కొస్తే.. 1220 పిక్సెల్స్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. పోకో ఎఫ్6లో సోనీ IMX882 సెన్సర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్టు సమాచారం.
ఇక ఈ పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 25 లోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో టాప్ ఎండ్ మోడల్ వెర్షన్ ధర రూ. 30 వేలలోపు ఉండవచ్చని అంచనా. కాగా పోకో ఎఫ్6 మోడల్‌కి కొనసాగింపుగా పోకో ఎఫ్6 ప్రో మోడల్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పోకో ఎఫ్5కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.