భాష రాదని చింతించాల్సిన అవసరం లేదు… ఈ సరికొత్త వాట్సాప్ ఫీచర్ తో ఏ భాషలోనైనా మాట్లాడే అవకాశం..?

ప్రముఖ మెసేజింగ్ ఆప్ వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా తన సేవలు అందిస్తోంది. దీంతో వాట్సప్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. రైతుల నుండి బిజినెస్ చేసే వారి వరకు ఈ యాప్ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఒకరి నుండి మరొకరికి చేరవేయటం మరింత సులభతరంగా మారిపోయింది. అయితే దీనిలో ఉండే మంచి ఫీచర్లు చాలా మందికి తెలీదు. ముఖ్యంగా వాట్సాప్ లో ఉండే భాషకు సంబంధించిన ఫీచర్స్ గురించి చాలామందికి అవగాహన ఉండదు. వాట్సాప్ లో ఇన్ బిల్ట్ గానే ఈ లాంగ్వేజీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లకైతే 70 భాషలు, ఐఓఎస్ యూజర్లకైతే 40 భాషలను వాట్సాప్ లో పొందవచ్చు. ఫలితంగా ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తితోనైనా ఈ భాషలోనైనా సులభంగా మెసేజ్ చేయవచ్చు.

వాట్సాప్ లో ప్పటివరకు కొన్ని పదుల సంఖ్యలో లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ మనం కేవలం రెండు లేదా మూడు భాషాలను మాత్రమే వినియోగిస్తున్నాం. వాటిల్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ వంటివి ఎక్కువగా ఉపయోగంలో ఉంటున్నాయి. అయితే ఈ వాట్సప్ నుంచి డైరెక్ట్ గా ఇతర భాషా మాట్లాడే వారితో మనం వారి భాషలోనే మాట్లాడవచ్చు. మనకు వారి భాష రాకపోయినా కూడా మనం మెసేజ్ చేసేయ్యవచ్చు. ఇలా చేయటానికి వాట్సాప్ లో ఈ భాషా ఎంపికలు ఎలా చేసుకోవాలి అన్న విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాట్సాప్ లో భాష ఎంపికలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• ముందుగా మీరు మెసేజ్ పంపాలి అనుకుంటున్న వ్యక్తి కాంటాక్ట్ పై క్లిక్ చేసి చాట్ విండోను ఓపెన్ చేయండి.
• ఆ తర్వాత చాట్ బాక్సులో మీకు వచ్చిన భాషలో మెసేజ్ ని టైప్ చేయండి.
• మొత్తం మెసేజ్ టైప్ చేసిన తర్వాత దానిని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. వెంటనే మీకు ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.
• ఆ పాప్ అప్ విండోలో ట్రాన్స్ లేటింగ్ అని ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
• ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, ఏ భాషాలోకి ట్రాన్స్ లేట్ కావాలో మీకు కనిపిస్తున్న లిస్ట్ నుంచి దానిని సెలెక్ట్ చేసుకోండి.
• ఇలా చేయటం వల్ల వెంటనే ఆ భాషలోనికి మీ మెసేజ్ మారిపోతుంది. ఆ తర్వాత సెండ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు పంపాలనుకున్న వ్యక్తికి వారి భాషలోనే మెసేజ్ వెళ్లిపోతుంది.