ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాంటింగ్ మెసేజ్ యాప్ అయినటువంటి వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.వాట్సప్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవలను యూసర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు.కేవలం మెసేజ్లు మాత్రమే కాకుండా విలువైన డాక్యుమెంట్స్ కూడా ఫార్వర్డ్ చేసే విధంగా అందుబాటులోకి వచ్చింది అదే విధంగా వాట్సప్ ద్వారా కూడా లావాదేవీలను ఒకరి నుంచి మరొకరికి పంపించవచ్చు. అయితే వాట్సాప్ ఇకపై మరికొన్ని సేవలను కూడా యూసర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకునే అవకాశాన్ని తీసుకు వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఉబర్ వాట్సాప్‌తో పార్ట్‌నర్‌షిప్ ని కుదుర్చుకుంది. ప్రస్తుతం దిల్లీ- NCR, లక్నో పరిసర ప్రాంతాల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉబర్ వెల్లడించారు. ఇకపై మనం ఎక్కడికి వెళ్లాలన్నా వాట్సప్ ద్వారా ఉబర్ రైడ్ బుక్ చేసుకుని వెళ్ళచ్చు. అయితే వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే..
ఈ సేవలను వాట్సప్ ద్వారా పొందటానికి ముందుగా ఉబర్ అఫీషియల్ నంబర్ +91 7292000002 ను మీ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ లో సేవ్ చేసుకోండి.సేవ్ చేసుకున్న ఈ నెంబర్ తో మనం చాట్ చేయవచ్చు మనం ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అనే విషయాలను తెలియచేయాలి అలాగే మనం వెళ్లాల్సిన లొకేషన్ కూడా షేర్ షేర్ చేయవచ్చు. ముందుగా ఈ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేసిన అనంతరం పికప్ అడ్రస్, డెస్టినేషన్ పాయింట్స్‌ను చెప్పండి.
పిక్‌అప్ కోసం లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు హిందీ ఇంగ్లీష్ భాషలలో అందుబాటులోకి రానున్నాయి.