వాట్సాప్ లో కొత్త రూల్స్… కాల్ చేయాలంటే బిల్ పే చేయాల్సిందే…?

ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ఈ మెసేజింగ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మెసేజ్, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, స్టేటస్ వంటి సదుపాయాలను వినియోగించుకుంటున్నారు. తాజాగా కొన్ని గంటల పాటు వాట్సాప్ పని చేయకపోవడంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటంతో రోజురోజుకి కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ప్రైవసీ, సెక్యూరిటీ, స్టేటస్ ప్రైవసీ, సెట్టింగ్స్ ఇలా అనేక విషయాలలో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

వాట్సాప్ రాకముందు కొన్ని మెసేజ్లు కంపెనీలు మెసేజ్ల కోసం ఒక మొత్తంలో డబ్బు వసూలు చేసేవారు. అంతేకాకుండా ఈ యాప్ రాకముందు విదేశాలలో ఉన్నవారికి ఫోన్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. కానీ వాట్సప్ యాప్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వీడియో కాల్ చేసి మాట్లాడుకొని వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉండగా..తాజాగా వాట్సాప్ సంస్థ వినియోగదారులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ ఇలాంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్ లకు టెలికాం రూల్స్ ఉండాలి అని COAI ను కోరింది. టెలికాం సంస్థలు టవర్లు, నెట్వర్క్ కోసం భారీగా ఖర్చ చేయడంతో పాటు అనేక రకాల నిబంధనలకు కూడా లోబడి పని చేస్తాము అని తెలిపాయి.

అయితే ఆరోగ్యకర పోటీ కోసం ఓటీటీ కమ్యూనికేషన్ యాపులకు వీటిని వర్తింపజేయాలని లేదంటే తమ లైసెన్స్ నియంత్రణలను తరలించాలి అని సదరు
ఓటీటీ సంస్థలకు వాట్సాప్ సంస్థ తెలిపింది. అన్ని ఓటీటీ సంస్థల లాగే వాట్సప్ కూడా ఈ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా వాట్సాప్ లో కాల్స్ ఉచితంగా ఉండవు. ప్రస్తుతం మొబైల్ డేట్ తో పైసా ఖర్చు లేకుండా చాటింగ్, ఫోన్ కాల్ వీడియో కాల్ చేసుకొనే అవకాశం ఉంది. కానీ ఆ నిబంధనల ప్రకారం వాట్సాప్ లో కాల్స్ చేసుకోవాలి చేయటానికి కూడా కచ్చితంగా డబ్బులు కట్టాల్సిన ఉంటుంది. మరి ఈ విషయంపై వాట్సాప్ సంస్థ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి మరి.