ఫేస్ బుక్ బ్లూ బ్యాడ్జ్‌ కోసం నెలకు రూ. 1200.. ఫీచర్లు వివరాలు..?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్స్ ని ఉపయోగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా యాప్స్ వాడకం పెరగటంతో యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఫేస్బుక్లో మరొక కొత్త ఫీచర్ అమలులోకి రానుంది. ఎలన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ బ్లూటూత్ పేరుతో ప్రతి నెల 900 రూపాయలు చెల్లించి ట్విట్టర్ ఖాతా కి బ్లూ టిక్ మార్క్ పొందే సదుపాయాన్ని కల్పించాడు. ఇక ఇప్పుడు ఎలన్ మస్క్ దారిలోకి మార్క్ జుకర్ బర్గ్‌ కూడా నడుస్తున్నాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌ బ్లూ బ్యాడ్జ్‌ వెరిఫికేషన్ కోసం నెలవారీ చందాను తీసుకొస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ సర్వీస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రారంభిస్తున్నట్లు త్వరలోనే మిగిలిన దేశాల్లో కూడా ప్రారంభిస్తామని చెప్పారు.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌ బ్లూ బ్యాడ్జ్ తీసుకోవడం వల్ల యూజర్లకు వెరిఫైడ్ బ్యాడ్య్‌ వస్తుంది. ఫేస్బుక్ ఇన్ స్టాగ్రామ్‌, అకౌంట్స్ లో ఉన్న వ్యక్తిగత సమాచారానికి అదనపు భద్రత లభిస్తుంది.అలాగే కస్టమర్ సర్వీస్ సేవలు కూడా మీకు మెరుగ్గా అందుతాయి. అంతే కాకుండా మీ పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సాధారణ యూజర్లతో పోలిస్తే.. వెరిఫైడ్ బ్యాడ్జ్‌ ఉన్న వాళ్లకి అదనపు ఫీచర్లను అందుబాటులో ఉంటాయి. అయితే ప్రభుత్వ గుర్తుపు కార్డుతో మీ ఖాతాని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో బ్లూ బ్యాడ్జ్‌ పొందిన వారికి వారి బ్యాడ్జ్ అలాగే ఉంటుంది. అయితే వాళ్లు కూడా నెలవారీ చందా కట్టాల్సి ఉంటుంది.

ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఈ బ్లూ బ్యాడ్జ్ కోసం నెలకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్లూ బ్యాడ్జ్ ఆండ్రాయిడ్ యూజర్లు 11.99(రూ.990) డాలర్లు, అలాగే ఐవోఎస్ యూజర్లు 14.99(రూ.1,240) డాలర్లు నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది. మెటా సంస్థ ప్రవేశపెట్టిన ఈ బ్లూ బ్యాడ్జ్‌ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల యూజర్లకు ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బ్లూ బ్యాడ్జ్‌ సబ్ స్క్రిప్షన్ సదుపాయాన్ని తొందర్లోనే భారతదేశంలో కూడా అమలు చేయనున్నట్లు మార్క్ జుకర్ బర్గ్‌ వెళ్లడించాడు.