ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటుగా ఆల్రెడీ మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. మోటోరోలా స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపుతో అతి తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొత్త కొత్త ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తోంది. తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. మరీ ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా భారత్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ గతవారమే 3 కలర్ ఆప్షన్లు, 2 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లలో అందుబాటులో ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 1.5కె పోల్డ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 125డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 8జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 పొందవచ్చు. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999కు పొందవచ్చు. లాంచ్ ఆఫర్‌గా బేస్ వేరియంట్ ధర రూ. 27,999, 12జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 31,999కు పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్ బ్యూటీ, లక్స్ లావెండర్, మూన్‌లైట్ పెర్ల్ షేడ్స్‌లో లభిస్తుంది. ఆసక్తి గల కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్‌లో ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా మోటోరోలా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై సేల్ ఆఫర్‌లలో పాత డివైజ్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 2 వేల తగ్గింపు ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లు, ఇఎంఐ లావాదేవీలతో ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 2,250 తగ్గింపు పొందవచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్ రూ. 3,084 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన పూర్తి లావాదేవీలకు రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఆండ్రాయిడ్ 14 ఆధారిత హాలో యూఐపై రన్ అవుతుంది. మూడు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5కె పోల్డ్ కర్వ్డ్ డిస్‌ప్లే, 2వేల నిట్స్ గరిష్ట స్థానిక బ్రైట్‌నెస్ లెవల్ హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ని కలిగి ఉంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 10ఎంపీ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ సపోర్టు కలిగి ఉంది.